పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగ సంఘాల ధర్నా

ములుగు, వెలుగు : పోస్టల్​ బ్యాలెట్​ ఇవ్వడంలేదని ములుగులో ఉద్యోగులు ధర్నా చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్​ బ్యాలెట్​ వినియోగించుకునేందుకు వెళ్తే రోజంతా వెయిట్ చేయించారని ఆరోపించారు. ఫెసిలిటేషన్​ కేంద్రం వద్దకు వెళ్తే  ఎన్నికల అధికారులు స్పందించడంలేదని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 9గంటలకు బ్యాలెట్ ఓటింగ్​ కోసం వస్తే సాయంత్రం 4గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోకుండా కారణాలు చెబుతున్నారన్నారు. నిరసన కార్యక్రమంలో   అన్నవరం రవికాంత్​,  గుల్లగట్టు సంజీవ,  హట్కర్​ సమ్మయ్య,  గొప్ప సమ్మారావు,  మంకిడి రవి, ఎట్టి సారయ్య,  పోదెం సమ్మయ్య,  కాసర్ల రమేశ్,  కొమురెల్లి, భూమిరెడ్డి అల్లం జగ్గారావు, తోలం కృష్ణయ్య, జబ్బ రవి, పూసం లక్ష్మీనారాయణ, బిళ్ల మల్లారెడ్డి, తులసి, మంజుల, సుగుణ తదితరులు పాల్గొన్నారు.