ఉన్నకాడ్నే పని ఏర్పాట్లు
వలస కూలీలకు కేంద్ర సర్కార్ ఊరట..
వేరే రాష్ట్రాలకు వెళ్లేందుకు మాత్రం నో
న్యూఢిల్లీ: ఊరుకాని ఊర్లో చిక్కుకున్న వలస జీవికి కేంద్రం ఊరటనిచ్చింది. ఉన్న చోటే పనులు కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం నుంచి వివిధ వ్యాపారాలు, పనులు చేసుకునేందుకు ఇప్పటికే అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కూలీల ఉపాధిపై ఆదివారం కేంద్ర హోం శాఖ గైడ్లైన్స్ విడుదల చేసింది. వలస కూలీలకు పరిశ్రమలు, మాన్యుఫాక్చరింగ్, నిర్మాణ రంగం, వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పథకం కింద
పనులివ్వాలని సూచించింది.
ఢిల్లీ, పంజాబ్ లలో నో
సోమవారం నుంచి వివిధ రంగాలకు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ నుంచి సడలింపులిచ్చినా ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు మాత్రం ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి సడలింపులు ఇచ్చేది లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. సడలింపులు ఇవ్వాలా వద్దా అన్నది ఈ నెల 27న రివ్యూ మీటింగ్ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘‘రాష్ట్రంలో 11 జిల్లాలున్నాయి. అవన్నీ ఇప్పుడు హాట్ స్పాట్లే. కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం కంటెయిన్మెంట్ జోన్లలో ఎలాంటి సడలింపులివ్వకూడదు. కాబట్టి, ఢిల్లీ ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సడలింపులు ఇవ్వట్లేదు’’ అని ఆయన చెప్పారు. ఇటు పంజాబ్ కూడా రాష్ట్రంలో సడలింపులకు చాన్స్ లేదని ప్రకటించింది.
For More News..