రైతు దినోత్సవానికి వస్తే.. ‘ఉపాధి’ హాజరు!

యాదాద్రి, వెలుగు:   యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్లలో  రైతు దినోత్సవం మీటింగ్​కు వస్తే..  హాజరు వేయిస్తామంటూ ఉపాధి హామీ కూలీలను తీసుకెళ్లారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అగ్రికల్చర్​, కో ఆపరేటివ్​ డిపార్ట్​మెంట్లు కలిసి శనివారం రైతు దినోత్సవం నిర్వహించాయి.  

వడ్ల కొనుగోళ్లు ఇంకా పూర్తి కాకపోవడంతో  రైతులు కొందరు సెంటర్లలో ఉంటే.. మరికొందరు చేన్లు, చెలకల్లో ఉన్నారు.  దీంతో  మీటింగ్​కు  కొందరు ఉపాధి కూలీలను  ఆఫీసర్లు, బీఆర్ఎస్​ లీడర్లు తరలించారు. ఉపాధి పనులకు హాజరు కావాల్సిన కూలీలు మీటింగ్​కు ఎందుకొచ్చారని ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది.