కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో అందిస్తున స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకొని యువత ఉపాధి అవకాశాలు పొందాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్ అన్నారు. మందమర్రిలోని సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేసిన కంప్యూటర్, డీటీపీ కోర్సులను జీఎం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం
భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం కార్పొరేట్సోషల్రెస్పాన్సిబిలిటీ కింద నిరుద్యోగ యువతకు స్కిల్‌డెవలప్‌మెంట్ ట్రైనింగ్ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ట్రైనింగ్‌ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏరియా ఏస్వోటుజీఎం రాజేశ్వర్‌రెడ్డి, డీజీఎం(ఈఎం) వెంకటరమణ, జీఎంవీటీసీ మేనేజర్శంకర్, అసిస్టెంట్ట్రైనింగ్ మేనేజర్అశోక్, ఏఐటీయూసీ లీడర్సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.