- రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి
బషీర్ బాగ్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ యూనివర్సిటీతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చెప్పారు. యువత స్కిల్స్ పెంచుకున్నప్పుడే పోటీ ప్రపంచంలో రాణించగలరని అభిప్రాయపడ్డారు. తపస్య కాలేజీ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్స్నాతకోత్సవం బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది.
ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి, ఓయూ ఎగ్జామ్స్కంట్రోలర్డాక్టర్ కమతం శ్రీనివాస్, తపస్య డైరెక్టర్ ఓగూరి శ్రీహరి పాల్గొన్నారు. మానవ విలువతో కూడిన విద్యను అందించేందుకు విద్యా సంస్థలు కృషి చేయాలని బాలకిష్టా రెడ్డి సూచించారు. 800 మంది స్టూడెంట్లకు డిగ్రీ పట్టాలు అందజేశారు.