Job News: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో స్పెషల్​ గ్రేడ్​ పోస్టులు భర్తీ

Job News: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో స్పెషల్​ గ్రేడ్​ పోస్టులు భర్తీ

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) 558 స్పెషలిస్ట్ గ్రేడ్- IIపోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు మే 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 
 
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)  డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 558 పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఎంస్‌, ఎండీ, ఎంసీహెచ్‌, డీఎం, డి.ఎ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ, డీపీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆశక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో మే 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఖాళీల సంఖ్య: 

  •   స్పెషలిస్ట్‌ గ్రేడ్‌- II పోస్టులు: 558 
  •  స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2(సీనియర్‌ స్కేల్): 155 పోస్టులు

విభాగాలు: కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ/ కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ(CTVS), ఎండోక్రినాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ/బర్న్స్, సర్జికల్ ఆంకాలజీ (క్యాన్సర్ సర్జరీ), యూరాలజీ.

రీజియన్‌లు: బీహార్‌, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్​

  •  స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2(జూనియర్ స్కేల్): 403 పోస్టులు

విభాగాలు: అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ & ఎస్‌టీడీ, ఈఎన్‌టీ, ఐ (ఆప్తాల్మాలజీ), జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ప్రసూతి & గైనే, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, పాథాలజీ, పల్మనరీ మెడిసిన్, రేడియాలజీ, సైకియాట్రీ, రెస్పిరేటరీ మెడిసిన్.

రీజియన్‌లు: ఆంధ్రప్రదేశ్, అస్సాం, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, బీహార్‌, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. 

అర్హత: సంబంధిత విభాగంలో ఎంస్‌, ఎండీ, ఎంసీహెచ్‌, డీఎం, డి.ఎ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ, డీపీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి

  •  26.05.2025 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. 
  • ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది. 
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500. 
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాహిళా, ఈఎస్‌ఐసీ ఉద్యోగులు, ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు  మినహాయింపు 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం: 

  •  స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 సీనియర్‌ స్కేల్‌కు రూ.78,800, 
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 జూనియర్‌ స్కేల్ పోస్టుకు రూ.67,700.

  దరఖాస్తుకు చివరి తేదీ: 26.05.2025.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 

 తెలంగాణ: Regional Director,ESI Corporation, Panchdeep Bhawan,  Hill Fort Road, Adarsh Nagar, Hyderabad-500063, Telangana

 ఆంధ్రప్రదేశ్: 48-7-32A, Panchdeep Bhawan, ESIC Road,Gunadala, Vijaywada, Andhra Pradesh.