
- ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం, వెలుగు : గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సమస్యలు చదువుతోనే పరిష్కారమవుతాయని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. ఆదివారం భద్రాచలంలో ఏఎస్డీఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా వ్యవసాయ కూలీలపై హింసను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీ మహిళలు కచ్చితంగా చదువుకోవాలని సూచించారు.
వారు నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలపై అవగాహన రావాలంటే చదువు తప్పనిసరి అని తెలిపారు. వ్యవసాయ సంక్షోభంలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి స్వభావం గురించి అవగాహన కల్పించారు. భూ సమస్య, వారసత్వ హక్కులు, అటవీ హక్కులు, లింగవివక్షత, లైంగిక వేధింపులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్డీఎస్ డైరక్టర్గాంధీబాబు, అడ్వకేట్స్ నాగరాజు, అంబేద్కర్, 120 మంది మహిళా వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.