
ఇమ్రాన్ హష్మీ హీరోగా తేజస్ విజయ్ డియోస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్రౌండ్ జీరో’.రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కాశ్మీర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో బీఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ నరేంద్ర నాథ్ దూబే పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటించాడు. సోమవారం ఈ వార్ డ్రామా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు.
భారతదేశం నుండి కాశ్మీర్ ను విడదీయాలని పాకిస్తాన్‌కు సంబంధించిన ఉగ్రవాద సంస్థలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ల కుట్రలను ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతోంది. ఈ సినిమాలోని నేపథ్యం కూడా అదే. 2001లో మన పార్లమెంట్‌పై అటాక్ తర్వాత కాశ్మీర్‌లోని టెర్రరిస్టులను మట్టుపెట్టడానికి బీఎస్ఎఫ్ ఎలాంటి చర్యలు చేపట్టింది. పార్లమెంట్ దాడి ప్రధాన సూత్రధారి ఘాజీ బాబాను బీఎస్ఎఫ్ జవాన్లు ఎలా హతమార్చారు అనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్.
హై ఆక్టేన్ యాక్షన్‌తో పాటు హృదయాలను హత్తుకునే ఎమోషన్ కలగలిసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో పాటు అడివి శేష్‘గూఢచారి 2’లోనూ ఇమ్రాన్ హష్మీ కీలకపాత్రలు పోషిస్తున్నాడు.