సినిమా షూటింగ్లో స్టార్ హీరో మెడకు గాయం.. ఎలా జరిగిందంటే?

సినిమా షూటింగ్లో స్టార్ హీరో మెడకు గాయం.. ఎలా జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హస్మి (Emraan Hashmi) కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ 'ఓజీ', అడవిశేష్ 'గూఢచారి 2' సినిమాల్లో విలన్ గా నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఇమ్రాన్ హష్మీకి 'గూఢచారి 2' సెట్లో గాయపడ్డారు.

యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరిస్తుండగా  ప్రమాదవశాత్తూ ఇమ్రాన్‌కు కుడి దవడ కింది భాగంలో గాయమైంది. ఈ విషయాన్ని ఆయన వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. అయితే,.. స్వయంగా తాను డిజైన్ చేసుకున్న ఒక యాక్షన్ సీక్వెన్స్‌ లో ఒక చోట నుంచి మరో చోటకు దూకుతున్న సమయంలో మెడకు గాయమైందని తెలుస్తుంది.

Also Read :- అమరన్‌ సినిమా ఫస్ట్ సాంగ్‌‌‌‌ రిలీజ్

ప్రస్తుతం ఇమ్రాన్ గాయపడిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లేటెస్ట్ ఫోటోల్లో ఆయన మెడకు గాయమైందని స్పష్టంగా కనిపిస్తుంది. కాగా ప్రస్తుతం ఇమ్రాన్ సేఫ్‌గానే ఉన్నాడని సినీ వర్గాల సమాచారం.  బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు ఉన్న ఇమ్రాన్ హస్మీ తెలుగులో విలన్ రోల్ చేస్తుండటంతో ఆసక్తి పెరిగింది. 

ఇమ్రాన్ చివరిగా డిస్నీ + హాట్‌స్టార్ సిరీస్ 'షోటైమ్‌'లో కనిపించాడు. సుమిత్ రాయ్ రూపొందించిన ఈ షోలో మౌని రాయ్, విజయ్ రాజ్, శ్రియా శరణ్, రాజీవ్ ఖండేల్వాల్ మరియు నసీరుద్దీన్ షా ప్రధానపాత్రలు పోషించారు.