కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు క్లారిటీ ఇచ్చారు.మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవు.. ఇసుక వల్ల సమస్య వచ్చింది మేం భావిస్తున్నాం..ఎక్కడో చిన్న పొరపాటు అయితే జరిగింది..7వ బ్లాక్ లో సమస్య రావడం వల్ల సెంటర్ పిల్లర్ కుంగి పోయిందని ఈఎన్సీ మురళీధర్ రావు అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లు (అక్టోబర్ 21)శనివారం సాయంత్రం కుంగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టు షేప్ మారిపోయింది. మెయింటెనెన్స్ వర్క్స్ చేస్తుండగా గేట్లనుంచి పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో అలెర్ట్ అయ్యారు అధికారు. పిల్లర్ కుంగినట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు.. బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ చేశారు. కాగా, గతేడాది కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్ లు వరదలో మునిగిపోగా.. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం గమనార్హం.
- ALSO READ | కాంగ్రెస్ కాళేశ్వరం యాత్ర.. అడ్డుకున్న పోలీసులు