శ్రీశైలం గొయ్యికి రిపేర్లు చేయించండి : ​అనిల్​కుమార్

శ్రీశైలం గొయ్యికి రిపేర్లు చేయించండి : ​అనిల్​కుమార్
  • ఎన్ డీఎస్ఏకి ఈఎన్​సీ జనరల్​ లేఖ

హైదరాబాద్​, వెలుగు: శ్రీశైలం ప్లంజ్​పూల్​గొయ్యికి వీలైనంత త్వరగా రిపేర్లు చేయించాలని నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ)ని ఈఎన్​సీ జనరల్​అనిల్​కుమార్​కోరారు. 2009లో వచ్చిన వరదలతో ప్రాజెక్టు ప్లంజ్​పూల్​లో భారీ గొయ్యి పడిందని, అది మరింత పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఎన్ డీఎస్ఏ చైర్మన్​కు లేఖ రాశారు. గొయ్యిని పూడ్చేందుకు ఏపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతుండడంతో అది ప్రమాదకర స్థాయికి చేరుకుందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్లంజ్​పూల్‌‌‌‌ ఏరియా కింద రాతి పగుళ్లు నెమ్మదిగా డ్యామ్​పునాదుల వైపు విస్తరిస్తున్నాయని, అది మొత్తం డ్యామ్​నే ప్రమాదంలో పడేసే ముప్పు ఉందని నేషనల్‌‌‌‌ ఇనిస్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఓషనోగ్రఫీకి చెందిన నిపుణులు ఇప్పటికే రిపోర్ట్​ ఇచ్చారని గుర్తు చేశారు. గొయ్యిని ఇలాగే వదిలేస్తే డ్యామ్​ కూలి ఏపీలోని ప్రాంతాలు మునగడంతో పాటు నాగార్జునసాగర్​డ్యామ్​తో పాటు పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.