హరీష్ రావు సభలో మాజీ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడిన వీడియోను చూపించి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మురళీధర్ రావుతో అలా మాట్లాడించింది బీఆర్ఎస్ అని ఆరోపించారు. ఆయన బీఆర్ఎస్ ఏంజెంట్ అని తమకు తెలుసన్న భట్టి .. రాష్ట్రానికి తీరని నష్టం చేసిన మురళీధర్ రావును తట్టాబుట్టా ఇచ్చి పంపించామన్నారు.
ALSO READ :- మన వలసలకు కారణం కేసీఆరే : సీఎం రేవంత్ రెడ్డి
హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు చదివే మినిట్స్ కు అంగీకరించబోమన్నారు. హరీష్, కేసీఆర్ రాష్ట్ర ఇరిగేషన్ కు తీరని నష్టం చేశారని ఆరోపించారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.