ఇన్‌‌ఫ్లో పెరుగుదలపై అలర్ట్‌‌గా ఉండాలి

ఇన్‌‌ఫ్లో పెరుగుదలపై అలర్ట్‌‌గా ఉండాలి

బోయినిపల్లి, వెలుగు : మిడ్ మానేర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌కు ఇన్‌‌ఫ్లో పెరిగిందని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అలర్ట్‌‌గా ఉండాలని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఈఎన్‌‌సీ శంకర్‌‌‌‌ ఆదేశించారు. బుధవారం బోయినిపల్లి మండలంలోని  మిడ్‌‌మానేర్‌‌‌‌ను సందర్శించారు. అధికారులతో కలిసి ప్రాజెక్టు గేట్లను పరిశీలించారు. ఇన్ ఫ్లో,  ఔట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌‌కు మూల, మానేరు, గంజి వాగుల ద్వారా 2,405 క్యూసెక్కులు

ఎస్సారెస్పీ నుంచి 10,500 క్యూసెక్కులు ఇన్‌‌ఫ్లో వస్తుండగా, రెండు గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కులు ఎల్‌‌ఎండీకి, అన్నపూర్ణ రిజర్వాయర్‌‌‌‌కు 6,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఈఎన్‌‌సీ తెలిపారు. అనంతరం ప్రాజెక్టు గేట్లను ఆన్ చేసి ఎల్ఎండీకి నీటిని విడుదల చేశారు. ఆయన వెంట ఈఈ జగన్, డీఈ, ఏఈలు ఉన్నారు.