మెదడువాపు టీకా మస్ట్ గా వేయించండి

మెదడువాపు టీకా మస్ట్ గా వేయించండి
  •     రేపటి నుంచి ఆగస్ట్ 15 వరకు టీకా ప్రోగ్రామ్ 
  •     ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్  జరిగేలా చూడాలి
  •     అధికారులను ఆదేశించిన  హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్  
  •     9 నెలల నుంచి 15 ఏండ్లలోపు పిల్లలకు ఇవ్వాలి 

హైదరాబాద్, వెలుగు: తొమ్మిది నెలల నుంచి 15  ఏండ్లలోపు పిల్లలకు మెదడు వ్యాపు నివారణ జేఈ (జపనీస్ ఎన్సెఫలిటీస్) వ్యాక్సినేషన్ వందశాతం చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో వ్యాక్సిన్ పై సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 15 వరకు క్యాంపెయిన్ నిర్వహిస్తుండగా.. ప్రభుత్వ స్కూళ్లు, మదర్సాలు, ప్రతి అంగన్ వాడీ సెంటర్ లో వందశాతం వ్యాక్సిన్ చేపట్టాలని పేర్కొన్నారు. 

 అంగన్ వాడీ సెంటర్లు, యూపీహెచ్ సీలు,  బస్తీ దవాఖానలు, కమ్యూనిటీ హాళ్లలో వ్యాక్సినేషన్ చేస్తారని తెలిపారు. ప్రతి ఏఎన్ఎం టార్గెట్ చేరుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ వెంకటి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి, ఇలియాస్ అహ్మద్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి  శ్రీనివాస్, మైనార్టీ మత పెద్దలు, అధికారులు 
పాల్గొన్నారు.