హైదరాబాద్, వెలుగు: అల్యూమినియం తలుపులు, కిటికీలు తయారుచేసే హైదరాబాద్ సంస్థ ఎన్‌కోర్–ఆల్కమ్ గుజరాత్‌లో నెలకొల్పిన ప్లాంటు ప్రారంభమయింది. సూరత్ వద్ద 1.84 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది.
అల్యూమినియం డోర్స్, విండోస్ విభాగంలో భారత్‌లో తొలి ఆటో రోబోటిక్ ఫెసిలిటీ ఇదేనని ఎన్‌కోర్ వుడ్‌క్రాఫ్ట్స్ ఫౌండర్, సీఎండీ అవుతు శివ కోటి రెడ్డి తెలిపారు. ఈ ప్లాంటు కోసం దశలవారీగా రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు.
‘ రోజుకు 35 వేల చదరపు అడుగుల తయారీ సామర్థ్యం ఈ ఫెసిలిటీ ప్రత్యేకత. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జనవరి 24 నుంచి జరిగే ఏస్‌టెక్ ట్రేడ్ ఫెయిర్‌లో అత్యాధునిక, వినూత్న ఉత్పత్తులను ప్రదర్శిస్తాం. ఇప్పటికే యూఎస్‌ఏ, యూకే, దుబాయ్, ఈయూలో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి సత్తా చాటాం.
సొంత ఆర్ అండ్ డీతో, ఇటలీ డిజైనర్ల సహకారంతో ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. 3,500లకుపైగా ప్రాజెక్టులు పూర్తి చేశాం. త్వరలో ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల్లో అడుగుపెడతాం’ అని రెడ్డి వెల్లడించారు.