బందిపొరలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

బందిపొరలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

మంగళవారం(నవంబర్ 5) జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలోని జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. మరొక ఉగ్రవాదని బలగాలు చుట్టిముట్టినట్లు తెలుస్తోంది. హతమైన ఉగ్రవాది విదేశీయుడని, లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందినవాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

ఎఫ్‌టిలుగా అనుమానిస్తున్న ఇద్దరు సాయుధ ఉగ్రవాదులు కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారం అందడంతో  భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. 

మూడు రోజుల క్రితం(నవంబర్ 1) బందిపోరాలోని పన్హార్ రోడ్డు వెంబడి ఉన్న ఆర్మీ క్యాంపుపై దాడి చేసిన అనంతరం అటవీ ప్రాంతాల్లోకి పారిపోయిన ఉగ్రవాదులు ఇదే గ్రూపుకు చెందినవారని ఉన్నత పోలీసు అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. అప్పటి నుంచి వీరి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నట్లు తెలిపారు.