శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సామాన్య పౌరులతో పాటు జవాన్లపై దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల బారాముల్లాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఇద్దరు భారత ఆర్మీ సైనికులు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే.. సోమవారం (అక్టోబర్ 28) మరోసారి భారత ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు ఎటాక్ చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ వద్ద శివ మందిర్ సమీపంలోని బటాల్‌లో ఉదయం 7 గంటలకు ఇండియన్ ఆర్మీకి చెందిన అంబులెన్స్ ఉగ్రమూకలు కాల్పులు జరిపారు. క్షణాల్లో అప్రమత్తమైన భారత జవాన్లు ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టాయి. జవాన్లు నిమిషాల వ్యవధిలో మెరుపు దాడి చేసి ఆర్మీ అంబులెన్స్‌పై కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. తద్వారా బారాముల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన సైనికుల మృతికి తాజాగా ఇండియన్ ఆర్మీ రివేంజ్ తీర్చుకుంది.
ALSO READ | చొరబాట్లు ఆగితేనే బెంగాల్లో శాంతి...కేంద్ర హోంమంత్రి అమిత్ షా
మరోవైపు.. టెర్రర్ ఎటాక్‌తో అలర్ట్ అయిన భద్రతా దళాలు.. మరికొందరు ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో అఖ్నూర్ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన ఉగ్రవాదులు ఏ గ్రూప్‌కు చెందిన వారు.. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.