ఎవరీ దయానాయక్.. సైఫ్ అలీఖాన్ ఇంటికి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఎందుకెళ్లారు..?

దయానాయక్.. దయానాయక్.. ఈ పేరు ఇప్పుడు దేశంలో మారుమోగుతోంది. ఈ పేరు ముంబైకి కొత్తకాదు.. అండర్ వరల్డ్ డాన్స్ కు పరిచయం చేయాల్సిన పేరు కూడా కాదు.. అయినా మరోసారి ఈ దయానాయక్ హైలెట్ అయిపోయారు. దీనికి కారణం లేకపోలేదు. ముంబైలోని యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి.. అతనిపై కత్తితో దాడి చేసిన తర్వాత.. ఊహించని విధంగా ఈ దయానాయక్.. సైఫ్ అలీఖాన్ ఇంటికి రావటమే చర్చనీయాంశం అయ్యింది.

సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనను మహారాష్ట్ర సర్కార్ సీరియస్ గా తీసుకున్నది. ఈ క్రమంలోనే విచారణ మొదలుపెట్టేసింది. ఊహించని విధంగా.. 2025, జనవరి 16వ తేదీ మధ్యాహ్నం దయానాయక్ సైఫ్ ఇంటికి వచ్చారు. చాలా సేపు ఇంట్లో తిరిగారు. అక్కడ ఉన్న సిబ్బందిని ప్రశ్నించాడు. విచారణ చేస్తున్న పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించారు దయానాయక్. 

ఇంతకీ ఎవరీ దయానాయక్ అంటారా.. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. 1990లో చోటారాజన్ గ్యాంగ్ లోని ఇద్దరిని ముంబై సిటీ నడిబొడ్డున ఎన్ కౌంటర్ చేశారు. అప్పుడు మొదలైంది దయానాయక్ ప్రస్తానం.. ఆ తర్వాత ఏకంగా 80 ఎన్ కౌంటర్స్ చేశారు. అండర్ వరల్డ్ లావాదేవీలు, హత్యలు, సుపారీలపై అతనికి ఉన్న నెట్ వర్క్ వల్లే ఇది సాధ్యం అయ్యింది అంటారు. దయానాయక్ ఎన్ కౌంటర్ల తర్వాత ముంబైలో అండర్ వరల్డ్ యాక్టివిటిస్ చాలా వరకు తగ్గాయి అని చెబుతారు. 

ALSO READ | Saif Ali Khan: వీడేనంట.. సైఫ్ అలీఖాన్ ను కత్తితో ఆరు పోట్లు పొడిచింది..!

చాలా చాలా రోజుల తర్వాత దయానాయక్ మళ్లీ మీడియా కంట పడ్డారు. సైఫ్ అలీఖాన్ ఇంటికి రావటం చూస్తుంటే.. ఈ దాడి వెనక అండర్ వరల్డ్ మాఫియా హస్తం ఉందా అనే అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సైఫ్ అలీఖాన్ పై దాడి వెనక అండర్ వరల్డ్ మాఫియా హస్తం ఉండే ఉంటుందనే అనుమానాలు.. దయానాయక్ ఎంట్రీ తర్వాత జోరందుకున్నాయి. 

ఇక దయానాయక్ వచ్చిన ఎంక్వయిరీ విధానం, ప్రశ్నించిన విధానం.. అతని స్టయిల్ అన్ని చూసిన తర్వాత ముంబై మీడియాలోనూ ఇలాంటి డౌట్స్ చాలా చాలా రావటంతోపాటు.. దయానాయక్ ఎంట్రీ ఎందుకు.. ఏం జరిగింది అనే ప్రశ్నలు తలెత్తాయి.