దేశ రాజధాని ఢిల్లీ గోకుల్ పురి మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ లో హషీమ్ బాబా గ్యాంగ్ కు చెందిన ముగ్గురు గాయపడ్డారు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. మార్చి 9న శీలంపూర్ లో కాల్పులు జరిగాయి. ఇందులో ఒకరు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. శీలంపూర్ కాల్పులు జరిపిన వారిపై సమాచారం అందడంతో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
హషీమ్ బాబా గ్యాంగ్ కు చెందిన అలీ అలియాస్ ఫహద్, ఆసిఫ్ అలియాస్ ఖలీద్, అల్సెజాన్ అలియాస్ థోథాను తమపై కాల్పులు జరిపారని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కూడా కాల్పులు జరిపామని చెప్పారు. రెండు వైపులా నుంచి దాదాపు 20 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయని.. ఈ కాల్పుల్లో కాళ్లకు గాయాలు కావడంతో ముగ్గురు గ్యాంగ్ స్టర్స్ పట్టుబడ్డారని వెల్లడించారు.