పుల్వామాలో మళ్లీ పేలిన తూటా.. ఉగ్రవాదులకు.. ఆర్మీ బలగాలకు మధ్య కాల్పులు

పుల్వామాలో మళ్లీ పేలిన తూటా.. ఉగ్రవాదులకు.. ఆర్మీ బలగాలకు మధ్య కాల్పులు

సరిహద్దులో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. భారత భద్రతా బలగాలే(BSF) టార్గెట్‌గా విరుచుకుపడుతున్నారు. సోమవారం  ( జూన్​ 3) ఉదయం జమ్మూకశ్మీర్‌లో(Jammu Kashmir) ఉగ్రవాదులు(Terrorists), భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందడంతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లాలోని నిహామాలో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందడంతో కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ‘పుల్వామా జిల్లా నిహామా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా బలగాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి’. అని కశ్మీర్ జోన్ పోలీసులు Xలో పేర్కొన్నారు.

కాల్పులో సమయంలో లష్కర్-ఇ-తోయిబా  రెసిస్టాన్స్‌ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు కమాండర్లు రాయిస్‌ అహ్మద్‌, రియాజ్‌ అహ్మద్‌లు భద్రతా బలగాలకు పట్టుబడ్డారు.పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ఎక్స్ తెలిపారు. అయితే కాల్పులు జరిగిన సమమంలో ఎవరూ మృతి చెందలేదని పోలీసులు తెలిపారు. ఓ ఇంట్లో లష్కరే తోయిబా టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో నిహామా ఏరియాను భారత ఆర్మీ  చుట్టుముట్టింది. స్థానికులను బయటకు పంపి  టెర్రరిస్టులు దాగి ఉన్న ఇంటిపై ఆర్మీ సిబ్బంది ( వార్త రాసే సమయానికి  )  కాల్పులు జరుపుతున్నారు. టెర్రరిస్టులను పట్టుకోవడానికి కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.