- పదార్థాన్ని పరమాణువు స్థాయిలో మనకు కావాల్సిన రీతిలో మలచుకోవడానికి వీలు కల్పించే సాంకేతిక పరిజ్ఞానం నానో టెక్నాలజీ.
- - 2-3 పరమాణువుల పరిమాణం ఒక నానోమీటరు. కనుక దీనిని నానో టెక్నాలజీ అని పిలుస్తారు.
- 1959లో తొలిసారిగా రిచర్డ్ ఫెయిన్ మాన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ఈ భావనను ప్రతిపాదించాడు.
- 1974లో టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన నొరియో తానిగుచి అనే జపాన్ శాస్త్రవేత్త నానోటెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించాడు.
- పరమాణువుల స్థాయి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను నిర్మించడం ద్వారా వాటి పరిమాణాన్ని పూర్తిగా తగ్గించడానికి వీలవుతుంది.
- కార్బన్ నానో ట్యూబ్స్, నానో క్రిస్టల్స్ వంటి ప్రస్తుతం అధిక వినియోగంలోకి వస్తున్నాయి.
- స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ ఫ్లోరెసెన్స్ మైక్రోస్కోపి, స్కానింగ్ ప్రోబ్ మైక్రోస్కోప్ వంటి అత్యాధునిక సూక్ష్మదర్శిని పరికరాల ద్వారానే నానో పదార్థాలను నిర్మించగలుగుతారు.
- ఉపయోగాలు
- వాటర్ ఫిల్టర్స్, ఎయిర్ కండీషనింగ్, మొబైల్స్, ఎయిర్ ఫిల్టర్స్, విమాన, ఆటోమొబైల్స్ నిర్మాణం, కాంపోజిట్స్ తయారీ, నానోట్యూబ్స్, నానోక్రిస్టల్స్ వంటి పరకరాల తయారీలో నానో టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
- వైద్యరంగంలో నానోటెక్నాలజీని ఉపయోగించి ఔషధాలను సంబంధిత అవయవాలను చేరవేసే నానోబోట్స్(నానో రోబోట్స్) ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
- నానో బయో ఇంజినీరింగ్ ద్వారా సెల్యులోజ్‌ను ఇథనాల్‌గా మార్చి ఇంధనం ఉపయోగించే వీలు కల్పించే ఎంజైములను నానో టెక్నాలజీ ద్వారా రూపొందించారు.
- నానో టెక్నాలజీ ద్వారా మడతలు పడని, మరకలు అంటుకోని నానో ఫ్యాబ్రిక్స్ అందుబాటులోకి వచ్చాయి.
- పాలీమర్ కంపోజిట్స్లోకి నానో పదార్థాలను ప్రవేశ పెట్టడం ద్వారా తేలికైన దృఢంగా ఉండే బేస్‌బాల్ బ్యాట్స్, టెన్నిస్ రాకెట్స్, హెల్మెట్స్, ఆటోమొబైల బంపర్స్ అందుబాటులోకి వచ్చాయి.
- గాజుపై నానో ఫిల్మ్ కోటింగ్ ద్వారా ఎలాంటి పదార్థాలు అంటుకోవు. ఇలాంటి గాజును కిటికీ అద్దాలు, కంప్యూటర్, కెమెరా డిస్ ప్లేల్లో వినియోగించుట ద్వారా వాటిని శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు.
- బంగారం నానో రేణువులను అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణలో ఉపయోగిస్తారు.
- పొటాషియం మాంగనీసు ఆక్సైడ్ పదార్థంతో తయారుచేసిన నానో ఫాబ్రిక్ తన బరువుకు 20 రెట్లు ఆయిల్‌ను గ్రహించగలదు. కాబట్టి దీన్ని క్లీనింగ్ ప్రాసెస్‌లో ఉపయోగిస్తారు.
- క్వాంటమ్ డాట్స్ అనే అర్థవాహక నానో క్రిస్టల్స్ ద్వారా మెరుగైన మెడికల్ ఇంజినీరింగ్ సాధ్యమవుతుంది.
- పేపర్ మందంలో సౌరప్యానల్స్ ఇప్పటికే నానో టెక్నాలజీ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.
- నానో సైన్స్ & టెక్నాలజీ మిషన్
- దేశ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను ఉద్దేశించి నానోటెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో 2007 మేలో భారత ప్రభుత్వం నానో సైన్స్ & టెక్నాలజీ మిషన్‌ను ప్రారంభించింది.
- భారతరత్న సి.ఎన్.ఆర్.రావు అధ్యక్షతన ఉన్న నానో మిషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ మిషన్ అమలవుతుంది.
- నానో సైన్స్ అడ్వైజరీ గ్రూప్, నానో అప్లికేషన్స్ & టెక్నాలజీ అడ్వయిజరీ గ్రూప్ అనే
- రెండు సలహా సంస్థలు ఈ మిషన్‌కు సంబంధించిన సాంకేతిక కార్యక్రమాలను అమలు చేస్తాయి.
- నానో మిషన్ ప్రధాన కార్యక్రమాలు
- పదార్థాన్ని ప్రాథమిక స్థాయిలో అర్థం చేసుకొని నానోమీటర్ స్థాయిలో దానిని వినియోగించేందుకు కృషి చేయడం.
- నానో టెక్నాలజీ అభివృద్ధికి కావాల్సిన ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, స్కానింగ్ ప్రోబ్ మైక్రోస్కోప్, ఆప్టిమల్ ట్వీజర్ వంటి పరికరాలను అభివృద్ధి చేయడం.
- నానో టెక్నాలజీ అభివృద్ధికి పబ్లిక్ – ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం.
- ఈ రంగంలో నిష్ణాతులైన మానవ వనరులను అభివృద్ధి చేయడం.
- నానోక్రిస్టల్స్, నానో ట్యూబ్స్ అభివృద్ధికి కృషి చేయడం.