ఎలక్ట్రిక్​ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ప్రోత్సాహం

ఎలక్ట్రిక్​ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ప్రోత్సాహం
  • గ్రేటర్​లో ఢిల్లీ తరహా కాలుష్య సమస్య రాకుండా ముందస్తు చర్యలు
  • ఎలక్ట్రిక్ వెహికల్స్​ కొంటే రాయితీలు ఇవ్వాలని ఆర్టీఏ నిర్ణయం

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో ఎలక్ర్టిక్​వాహనాలను ప్రోత్సహించాలని రవాణాశాఖ అధికారులు నిర్ణయించారు. అందుకనుగుణంగా రాబోయే రోజుల్లో ఎలక్ర్టిక్, సీఎన్​జీ వాహనాలను ఎక్కువ కొనుగోలు చేసేలా రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.  ప్రస్తుతం గ్రేటర్​పరిధిలో 82,787 వాహనాలుండగా ఇందులో 50 శాతం వరకూ టూ వీలర్లు ఉంటాయని, తర్వాత స్థానం కార్లదేనని అధికారులు అంటున్నారు.  

హైదరాబాద్​లో 38.84 లక్షలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 21.05 లక్షలు, మేడ్చల్​పరిధిలో 22.05 లక్షల వాహనాలు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. రోజు రోజుకూ ఈ వాహనాల సంఖ్య పెరిగిపోతుండడంతో కాలుష్యం కూడా పెరుగుతోంది.  కానీ ఇక నుంచి ఆ పరిస్థితి రాకుండా గ్రేటర్​పరిధిలో ఎలక్ట్రిక్​ వెహికల్స్​పాలసీని కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు.  అందులో భాగంగానే వాహనాలు కొనాలనుకునే వారు ఎలక్ర్టిక్​ వాహనాలు కొనుగోలు చేసే వారిని ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. 

గ్రేటర్​ పరిధిలో ఎలక్ట్రిక్​వాహనాలకు గ్రీన్​సిగ్నల్​

ప్రస్తుతం సిటీలో14 వేల ఎలక్ర్టిక్ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఎలక్ర్టిక్​ఆటోలు 273, ట్రాన్స్​పోర్ట్​వాహనాలు 418 ఉన్నాయి. త్వరలో ఎలక్ర్టిక్​ఆటోలకు పర్మిట్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్​ నగరంలో ఆటోల నిషేధం ఉన్నందున ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం అనుమతులివ్వాలని నిర్ణయించారు. 

రాయితీలతో ఆకట్టుకునేలా..

ఎలక్ట్రిక్​వెహికల్స్ కొనుగోలు చేస్తే ఇంతకుముందు లైఫ్​టాక్స్​మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఉచితంగా రిజిస్ట్రేషన్​కూడా చేసిస్తున్నారు. 15 ఏండ్లు దాటిన పెట్రోల్, డీజిల్​బండ్లుంటే స్ర్కాప్​గా మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకూ స్ర్కాప్​చేయించాలన్నా అప్పటి వరకూ ఉన్న పెనాల్టీలు, గ్రీన్​టాక్స్​ పెండింగ్​ఉంటే చెల్లించాల్సి ఉండేది.  కానీ ఎలక్ట్రిక్​ వాహనాలను కొనేందుకు వాటిపై ఉన్న పెనాల్టీ, ట్యాక్స్​మాఫీ చేయాలని నిర్ణయించారు. స్ర్కాప్​తర్వాత కొత్తవాహనం కంటే దాని ధరను బట్టి రూ. వెయ్యి  నుంచి రాయితీ ఇవ్వనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పాలసీ అమలులో భాగంగా ఆర్టీఏ అధికారులు ఈ  చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నగరంలో తక్కువ ఛార్జింగ్​స్టేషన్లు ఉన్నాయన్న కారణంగానే చాలా మంది ఎలక్ర్టికల్​వాహనాలు కొనడం లేదు.   త్వరలో చార్జింగ్​స్టేషన్ల ఏర్పాటుకు పెద్దసంఖ్యలో అనుమతులివ్వాలని నిర్ణయించారు. దీంతో రాబోయే రెండేండ్లలో హైదరాబాద్​ నగరంలో పూర్తిగా ఎలక్ర్టిక్​ వాహనాలే నడిచేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.