
మేడిపల్లి, వెలుగు: అక్రమ కూల్చివేత సమయంలో రెవెన్యూ సిబ్బందిపై దుర్భాషలాడిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 63/28 నుంచి 63/39 వరకు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేశారు. తహసీల్దార్ హసీనా ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్‌ఐ రాకేశ్ గురువారం ఇంటిని పరిశీలించి కూల్చివేశారు.
దీంతో ఆక్రమణదారులు రవికుమార్, పుష్ప జేసీబీకి అడ్డుగా వచ్చి రెవెన్యూ అధికారులను దుర్బాషలాడుతూ ఆర్‌ఐ, రెవెన్యూ సిబ్బందిని అడ్డగించారు. దీంతో 100కు కాల్ చేయగా పోలీసులు వచ్చి ఆఫీసర్లను పక్కకు తీసుకెళ్లారు. తహసీల్దార్ హసీనా మాట్లాడుతూ.. అక్రమంగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేవారిని ఉపేక్షించేది లేదన్నారు దళారులను నమ్మి ప్రభుత్వ భూముల్లో స్థలాలు కొనుగోలు చేయొద్దని ఆమె సూచించారు.