- గిరిజనులను ఖాళీ చేయించిన తహసీల్దార్ సురేశ్
కూసుమంచి, వెలుగు : కూసుమంచి మండలంలో దుబ్బతండా గ్రామానికి చెందిన గిరిజనులు సోమవారం ఉదయం డబుల్ బెడ్ రూం ఇండ్ల తాళాలను పగలగొట్టి లోనికి ప్రవేశించారు. దీంతో సమాచారం అందుకున్న తహసీల్దార్ సురేశ్ మరో మూడు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి,
అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇండ్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గిరిజనులు ఇండ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు.