పద్మారావునగర్ లో రోడ్డు ఆక్రమించి పిల్లర్ల నిర్మాణం..కూల్చేసిన హైడ్రా

పద్మారావునగర్ లో రోడ్డు ఆక్రమించి పిల్లర్ల నిర్మాణం..కూల్చేసిన హైడ్రా

పద్మారావునగర్, వెలుగు: పద్మారావునగర్ ​స్కందగిరి ప్రాంతంలో ఓ మాజీ మున్సిపల్​ఉద్యోగి రోడ్డును కబ్జా చేసి బిల్డింగ్ కట్టేందుకు యత్నించాడు. సమాచారం అందుకున్న హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు విచారణ చేపట్టి శుక్రవారం పిల్లర్లను కూల్చేశారు. 1986లో స్కందగిరిలో లేఅవుట్ ప్రకారం స్థానికులు ఇండ్లు కట్టుకున్నారు. మున్సిపల్​కార్పొరేషన్​లో పనిచేసే ఓ ఉద్యోగి 1991 రోడ్డును ఆక్రమించి పిల్లర్లు వేశాడు. ఆ పక్కన మరో వ్యక్తి ఏకంగా బిల్డింగ్​నిర్మించాడు.

స్థానిక అపార్ట్​ మెంట్ వాసులు ఏండ్లుగా ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ స్పందన లేదు. ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేయగా, శుక్రవారం కాంక్రీట్​పిల్లర్లను కూల్చివేశారు. ఇదే దారిపై ఉన్న ఓ అపార్ట్ మెంట్ కు నోటీసులు ఇచ్చామని, దానిపై కూడా చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు తెలిపారు. హైడ్రా సీఐ ఆదిత్య, బేగంపేట జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్​సమ్మయ్య, డీసీపీ సుస్మిత, చైన్​మెన్లు జగదీశ్, భూషణ్, సిబ్బంది పాల్గొన్నారు.