ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను అరికట్టాలి

హైదరాబాద్, వెలుగు : బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీలోని బీజేపీ కార్పొరేటర్లు శుక్రవారం బుద్ధభవన్​లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, పార్కులు ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరారు.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్​ను కలిసినవారిలో కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, ప్రేమ్ మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.