టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీలక ప్రకటన

  • మునుపటి స్థాయిలో ఆడలేకపోతున్నా..
  • ఆస్ట్రేలియా ఓపెన్ నా కెరీర్ లో చివరిది: సానియా

భారత  స్టార్ ప్లేయర్ సానియా మీర్జా సంచలన ప్రకటన చేశారు. తన టెన్నిస్ కెరీర్ కు గుడ్ బై చెబెతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ 2022 తొలి రౌండ్ లో ఓటమి అనంతరం తన  టెన్నిస్ కెరీర్ కు ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు. టెన్నిస్ ర్యాంకింగ్స్ లో 68వ స్థానంలో ఉన్న సానియా మీర్జా.. సింగిల్స్ విభాగంలో 27వ ర్యాంకులో సత్తా చాటుతోంది. 2016లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ లో మార్టినా హింగిస్ తో కలిసి టైటిల్ సాదించిన విషయం తెలిసిందే. 
భారత్ తరపున తొలి గ్రాండ్ స్లామ్ అందుకున్న భారతీయురాలిగా చరిత్ర సృష్టించి ఎన్నో విజయాలతో భారత టెన్నిస్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన హైదరాబాదీ సానియా మీర్జా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుని షోయబ్ మాలిక్ తో వైవాహిక జీవితం గడుపుతున్నప్పటికీ టెన్నిస్ రాకెట్ విడిచిపెట్టలేదు. పిల్లాడిని కన్న తర్వాత కూడా టెన్నిస్ రాకెట్ పై మమకారంతో అడపా.. దడపా టెన్నిస్ టోర్నీల్లో ఆడుతూనే ఉన్నారు. అయితే గత రెండేళ్లుగా కరోనా విజృంభించిన సమయం నుంచి అంతర్జాతీయ టోర్నీలు పెద్దగా లేకపోవడంతో  సానియా టెన్నిస్ టోర్నీల్లో పాల్గొనలేదు. 
ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ 2022లో నదియా కిచెనాక్ తో కలసి బరిలోకి దిగిన సానియా తొలి రౌండ్ ఓటమితో నిరాశ చెందినట్లు కనిపించినా నాకు తెలుసు.. ఇదే నా చివరి టోర్నీ అవుతుందని అనుకుంటూనే వచ్చా.. మ్యాచ్ లో ఓడిపోయానని కాదు కానీ.. నా రెండేళ్ల బాబును వెంట పెట్టుకుని టోర్నీల కోసం దేశాలు తిరగాల్సి రావడం.. శారీరకంగా.. మానసికంగా ఇబ్బందికరంగా ఉంది.. మునుపటి ఫామ్ కొనసాగించలేకపోతున్నానని అర్థమవుతోంది.. అందుకే కెరీర్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నానని సానియా మీర్జా వెల్లడించింది. 

 

 

ఇవి కూడా చదవండి

ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్చల్

ఒమిక్రాన్.. మైల్డ్ అన్న ప్రచారం సరికాదు