మనం మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేస్తుంటాం కదా. డిజిటల్ చెల్లింపులకు OTP అనే కీలకం. మనం డిజిటల్ పేమెంట్స్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్ చేస్తేనే చెల్లింపులు జరుగుతాయి. అయితే స్కామర్లు ప్రజలను మోసగించడానికి, వారి డబ్బును దొంగిలించడానికి ఓటీపీని ఓ సాధనంగా ఉపయో గించు కుంటారని ఆర్బీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. భారతదేశంలో డిజిటల్ స్కామ్ లు అతిపెద్ద సవాల్ గా మారాయి. ఈక్రమంలో మొబైల్ వన్ టైమ్ పాస్ వర్డ్ ఫీచర్లను తొలగించి కొత్త సాంకేతికతో భర్తీ చేయాలని భావిస్తోంది ఆర్బీఐ.
ALSO READ | పేటీఎం బ్యాంక్ విషయంలో వెనక్కి తగ్గం: ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ టైమ్ పాస్ వర్డ్ విధానికి స్వస్తి చెప్పాలని యోచిస్తోంది. దీని స్థానంలో స్మార్ట్ ఫోన్లలో యాప్ లేదా బయోమెట్రిక్ సెన్సార్ వంటి సేఫ్టీ సాధనాలను తెచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. దీంతో చెల్లింపులను మరింత భద్రత తో, హ్యాకర్లనుంచి గట్టి భద్రతను అందించాలని భావిస్తోంది.
భద్రతాపరమైన లోపాలతో OTP విధానం డిజిటల్ పేమెంట్స్ విషయం చాలా వీక్ గా ఉందని ప్రజలు తరుచుగా కంప్లయింట్ చేయడంతో RBI ఈ విషయం పెద్ద సవాల్ గా మారింది. వాస్తవానికి OTP కి బదులుగా వివిధ ఫ్లాట్ ఫారమ్ లలో UPI చెల్లింపులు చేయడానికి ఉపయోగించే MPIN విధానానికి కూడా మారే అవకాశం ఉంది. OTP నుంచి ఈ యాప్ లకు మారడం అనేది భద్రతా పరంగా మంచి మార్పు అయినా.. ఈ యాప్ లకు సపోర్ట్ లేని ఫీచర్ ఫోన్ లను ఉపయోగించేవారికి ఇది సమస్యగా మారే అవకాశం ఉంది.
RBI ఈ పాయింట్లను పరిశీలనలో తీసుకొని యాప్ లకు యాక్సెస్ ఉన్న వారికే కాకుండా, అందరికీ సేవలందించే పరిష్కారాన్ని అందించాలి. కొత్త సెక్యూరిటీ లేయర్ ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో స్పష్టత లేకపోయినా.. ఈ మార్పు అనివార్యం.