మంచిర్యాలలో ముగిసిన క్రియేటివ్ కిడ్స్ సమ్మర్ క్యాంప్

మంచిర్యాల, వెలుగు: మైత్రీ యోగా ప్రకృతి సెంటర్ ఆధ్వర్యంలో  నెల రోజుల నుంచి నడుస్తున్న క్రియేటివ్ కిడ్స్ సమ్మర్ క్యాంపులు ఆదివారం ముగిసినట్లు క్యాంప్ నిర్వాహకులు డాక్టర్​ సుకుమార్, డాక్టర్​సమీరా తెలిపారు.

 5 నుంచి 15 ఎండ్ల వయసున్న పిల్లలకు అనుభవజ్ఞులైన టీచర్లతో నృత్యం, శ్లోకాలు, పాటలు, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, కరాటే, సంగీతం, వ్యక్తిత్వ వికాసం, శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడే పలు రకాల యాక్టివిటీస్ నేర్పించినట్లు చెప్పారు. పిల్లలకు శారీరక, మానసిక ఎదుగుదల కోసం ప్రతిరోజూ యోగా తరగతులు కూడా నిర్వహిస్తామని తెలిపారు.