దేవాదాయ శాఖ అదనపు కమిషనర్​గా శ్రీనివాసరావు

దేవాదాయ శాఖ అదనపు కమిషనర్​గా శ్రీనివాసరావు

హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్​గా శ్రీనివాస​రావు నియమితులయ్యారు. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీనివాస​రావు ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ట్రైబ్యునల్​ సభ్యుడిగా కొనసాగారు. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్​గా కొనసాగుతున్న కూరాకుల జ్యోతి నియమితులయ్యారు. 

దేవాదాయ శాఖలో ముగ్గురు అదనపు కమిషనర్లు ఉంటారు. ఇద్దరు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారు. ఒకరు ట్రైబ్యునల్​ సభ్యుడిగా కొనసాగుతారు. రోటెషన్​ పద్ధతిలో మూడేళ్లకొకసారి మారుతుంటారు. ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్​గా జ్యోతి బాధ్యతలు చేపట్టిన మూడేండ్లు పూర్తి కావడంతో  శ్రీనివాసరావు స్థానానికి పంపించారు.