పోచమ్మతల్లికి మంత్రి బోనం

పోచమ్మతల్లికి మంత్రి బోనం

గీసుగొండ, వెలుగు: దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం పోచమ్మ బోనం ఎత్తారు. వరంగల్‍ జిల్లా గీసుగొండ మండలంలోని సొంత గ్రామమైన వంచనగిరిలోని అమ్మవారి ఆలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. మంత్రికి ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‍రావు బోనం అందించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి దంపతులిద్దరూ అమ్మవారికి ఆలయానికి వెళ్లి బోనం సమర్పించారు.