ఇరాన్​ – అమెరికా ఇప్పుడు దుష్మన్లు

ప్రపంచంలో ఆగర్భ శత్రువులెవరంటే… అమెరికా–ఇరాన్​ల పేరే చెబుతారు. నిజానికి ఈ రెండు దేశాలు ఒకప్పుడు చెట్టపట్టాలేసుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యాక్సిస్​ ఫోర్స్​కి ఇరాన్​  కావలసిన దేశంగా పనిచేసింది. యుద్ధం ముగిశాక ఇరాన్​  షా యూరప్​, అమెరికా మోడల్​తో తన దేశాన్ని పాలించాడు. 40 ఏళ్లపాటు సాగిన షా పాలన… ఇస్లామిక్​ రివల్యూషన్​తో అంతమైంది. అక్కడ మొదలైన శత్రుత్వం ఇప్పుడు బాగా ఊడలు దిగింది.

ఇరాన్​లో చక్రవర్తిని ‘షా’ అని పిలిచేవారు. వీరిలో చివరి షా మహమ్మద్ రెజా పెహ్లావీ. 1941నుంచి 1979 వరకు ఇరాన్​ను పెహ్లావీ పాలించారు.  షా హయాంలో ఇరాన్​లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పాలనా వ్యవహారాల్లో షా చాలా లిబరల్​గా వ్యవహరించారు. వెస్ట్రన్ కంట్రీస్​కి అనుకూలం. స్కూళ్లలో ఇంగ్లీషు చదువును ప్రవేశపెట్టారు. గల్ఫ్  ప్రాంతంలో ఇరాన్​ను నమ్మకమైన దేశంగా అమెరికా, బ్రిటన్ దేశాలు భావించేవి. అమెరికాతో ఇరాన్​కి బిజినెస్ లావాదేవీలు కూడా ఉండేవి. వీటి ఫలితంగా ఇరాన్ ఆర్థికంగా డెవలప్ అయింది. అనేక సంస్కరణలకు కింగ్ షా శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఛాందసవాదుల పెత్తనం బాగా తగ్గించారు. ఆడవాళ్లకు కూడా మగవాళ్లతో సమానంగా హక్కులు కల్పించారు. యూరప్ ​ వెళ్లే స్టూడెంట్లకు స్కాలర్​షిప్​లు ఇచ్చారు.  పల్లెల్లో స్కూళ్లు, ఆస్పత్రులు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. ఇరాన్ చరిత్రలో షా తీసుకువచ్చిన సంస్కరణలను అప్పట్లో ‘వైట్ రివల్యూషన్’ అనేవాళ్లు. తన పనులు అన్నిటికీ అమెరికా లాంటి దేశాల్నే మోడల్​గా షా తీసుకునేవారట. ఇదే దేశంలోని ఇస్లామిక్ వాదులకు నచ్చలేదు. మతాన్ని చక్రవర్తి  షా పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి మెల్లమెల్లగా దేశంలో వ్యాపించింది. చివరకు 1979 నాటి ఇస్లామిక్ ఉద్యమానికి దారి తీసి, దేశంలో పెనుమార్పులు తీసుకువచ్చింది.

బందీలుగా అమెరికా ఎంబసీ సిబ్బంది

ఇస్లామిక్ రివల్యూషన్ బ్యాక్ డ్రాప్​లో ఆయతొల్లా ఖొమైనీకి అనుకూలంగా ఉండే ఇరాన్ స్టూడెంట్స్ 1979 నవంబరు 4న  టెహ్రాన్​లోని అమెరికా ఎంబసీలోకి ఎంటరయ్యారు. సిబ్బంది సహా మొత్తం 52 మందిని బందీలుగా పట్టుకున్నారు. 444 రోజుల పాటు (1981 జనవరి 20 వరకు) ఇది కొనసాగింది. అమెరికాలో ఆశ్రయం పొందిన షాను తమకు అప్పగించాలన్నది ఇరాన్ స్టూడెంట్స్ ప్రధాన డిమాండ్. అయితే షా కేన్సర్​ కి  ట్రీట్​మెంట్ తీసుకుంటున్నారని, మానవతా కోణంలో  ఆలోచించాలని అమెరికా చెప్పింది. దీనికి ఇరాన్ స్టూడెంట్స్ ఒప్పుకోలేదు. ఈ సంఘటనే చరిత్రలో ‘ఇరాన్ హోస్టేజ్ క్రైసిస్’గా పాపులరైంది. ఈ దశలో ఇరాన్​పై అమెరికా దాడికి దిగింది. దీనికోసం ఇరాక్ భూభాగాన్ని ఉపయోగించుకుంది. ఇరాక్​లో తన సేనలకు ఎయిర్ బేస్ ఏర్పాటు చేసుకుంది. ఆ తరువాత 1981లో ఈ గొడవకు ఎండ్ కార్డ్ పడింది. బందీలుగా పట్టుకున్న అమెరికన్లను ఇరాన్ వదిలిపెట్టినా, ఈ ఎపిసోడ్ వల్ల అప్పటి అమెరికా ప్రెసిడెంట్  జిమ్మీ కార్టర్ ఇమేజ్ ప్రజల్లో బాగా దెబ్బతింది. ఫలితంగా 1980 నవంబరు 4న జరిగిన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో కార్టర్ ఓడిపోయి రిపబ్లికన్ పార్టీకి చెందిన రోనాల్డ్ రీగన్ గెలిచారు. అమెరికా సిబ్బందిని పట్టుకున్నప్పటి నుంచి రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి.

అణు ఒప్పందంతో తీవ్రమైన గొడవలు

అమెరికాతో రిలేషన్స్ దెబ్బతినడంతో తన మనుగడ కోసం అణు బాంబును తయారు చేసుకోవాలని ఇరాన్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీఓఏ)’ లో భాగంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్​లోని దేశాలతో ఇరాన్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని  అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరాన్ బాంబు తయారీకి  ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అయితే  కేవలం అణు విద్యుత్​ని మాత్రమే ఉత్పత్తి చేయాలని అనుకుంటున్నామని ఇరాన్ వివరణ ఇచ్చినా అమెరికా ఒప్పుకోలేదు. రక్షణపరంగా ఇరాన్ , ఇరాక్ లకు ఒక ప్రత్యేకత ఉంది. రెండు దేశాలకు ‘స్ట్రాటెజిక్ పాయింట్స్’గా  గుర్తింపు ఉంది. రెండు దేశాల్లోనూ బలమైన రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీలు ఉన్నాయి.

ఆ విప్లవానికి 40 ఏళ్లు

ప్రపంచ చరిత్రలో ఇరాన్ విప్లవం ఒక కీలక ఘట్టం. కిందటేడాది ఫిబ్రవరికి ఇస్లామిక్ రివల్యూషన్​కు 40 ఏళ్లు నిండాయి. 1979లో అప్పటి ఇరాన్ చక్రవర్తి  షాకు వ్యతిరేకంగా ఆయతొల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ వాదులు ఉద్యమించారు.  షా నాయకత్వంలోని ఇరాన్​లోని రాచరిక వ్యవస్థను కూలదోయడంతో, 1979 ఏప్రిల్​లో ఇస్లామిక్ రిపబ్లిక్​గా ఇరాన్ మారిపోయింది. విప్లవానికి నాయకత్వం వహించిన ఆయతొల్లా ఖొమేనీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. షా ఇరాన్ నుంచి వెళ్తూ వెళ్తూ  పెద్ద మొత్తంలో సంపదను కూడా తనతో తీసుకెళ్లాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇస్లామిక్ రివల్యూషన్ తరువాత ఇరాన్​ కు కొత్త రూపు ఇవ్వడానికి, తనదైన స్టయిల్​ లో  అభివృద్ధి చేయడానికి ఖొమేనీ కష్టపడాల్సి వచ్చింది. ఇస్లామిక్ రిపబ్లిక్​గా మారిన ఇరాన్ బాగు కోసం జీవితాంతం కష్టపడ్డ ఆయతొల్లా ఖొమేనీ 1989లో చనిపోయారు.

ఇరాక్​కు అమెరికా అండ

గొడవల కారణంగా ఒకప్పటి మిత్రదేశమైన ఇరాన్ తన పట్టు నుంచి జారిపోగానే అమెరికా దృష్టి ఇరాక్​పై పడింది. గల్ఫ్ లో  ఇరాన్​కు వ్యతిరేకంగా ఇరాక్​ను ప్రోత్సహించడం మొదలెట్టింది. ఇరాన్​కు దీటుగా ఇరాక్​ను తయారు చేసింది. ఈ పరిస్థితుల్లో కుర్దులను అప్పటి ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ బలగాలు ఊచకోత కోయడంతో  ఆ ప్రాంతంలో  పరిణామాలు చకచకా మారిపోయాయి. కుర్దులకు ఇరాన్ అండగా నిలిచింది. ఇది చివరకు ఇరాన్, ఇరాక్ మధ్య యుద్ధంగా మారింది. 1980లో మొదలైన ఈ యుద్ధం ఎనిమిదేళ్లపాటు కొనసాగి,  ఇరాన్ అన్ని విధాలా నష్టపోయింది. ఇరాన్​లో టూరిజం బాగా ఎక్కువ. షియా వర్గానికి చెందిన మతపరమైన ప్రదేశాలు ఇరాన్​లో చాలా ఉన్నాయి. వీటిని చూడటానికి ప్రతి ఏడాది ఇతర దేశాల  షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఇరాన్​కు వస్తుంటారు. ఇరాక్​తో యుద్ధం కారణంగా విదేశీ టూరిస్టులు రావడం తగ్గిపోయింది. దీంతో రాబడి తగ్గి, ఇరాన్ ఆర్థికంగా నష్టపోయింది. ఈ యుద్ధంలో అమెరికా పూర్తిగా ఇరాక్ వైపు నిలిచింది. ఇరాక్​కు అవసరమైన నిధులు, ఆయుధాలు అందించింది. రెండు దేశాల మధ్య తగాదాని ఇతర గల్ఫ్​ దేశాలు బాగా వాడుకున్నాయని, ఇవి కలవడానికి వీల్లేనంత గ్యాప్​ సృష్టించాయని చెబుతారు  ఎనలిస్టులు.

సద్దాంను హతమార్చిన అమెరికా సేనలు

ఇరాన్ కు వ్యతిరేకంగా ఇరాక్ ను ప్రోత్సహించిన అమెరికా ఆ తర్వాత ఇరాక్ పాలకుడైన సద్దాం హుస్సేన్ ను బలిగొంది. ఒక దశలో అమెరికాకు సద్దాం హుస్సేన్ కొరకరాని కొయ్యగా మారడంతో ఇరాక్​పై యుద్ధం డిక్లేర్ చేసింది. సద్దాంను బంధించడంతో  2006 డిసెంబర్ 30న  ఇరాక్ ఇంటీరియం ప్రభుత్వం సద్దాంకు ఉరిశిక్ష అమలు చేసింది.

అభివృద్ధి లేని ఎజెండా

హిందూ రాష్ట్ర సాధన కోసమే బీజేపీ పని చేస్తుంది. బీజేపీ వాళ్ల ఎజెండాలో అభివృద్ధి అనే అంశమే లేదు.  – శశి థరూర్, కాంగ్రెస్ లీడర్

ఇల్లీగల్​ ఎంట్రీని అడ్డుకుంటాం

ఇల్లీగల్​ మైగ్రెంట్లను ఇండియాలోకి అనుమతించేది లేదు. వాళ్లను అడ్డుకుంటాం. వెనక్కి పంపేస్తాం. – దిలీప్ ఘోష్,  పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్

పెద్ద కొడుకులా పని చేస్తా

మాకు ఓటేస్తే… ప్రతి ఫ్యామిలీకి పెద్ద కొడుకులా పని చేస్తా. ఇంకా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. – అరవింద్​ కేజ్రీవాల్​, ఢిల్లీ సీఎం

సినీ ఇండస్ట్రీకి డబ్బే దైవం

సినిమా ఇండస్ట్రీకి డబ్బే ప్రధానం. వాళ్ల ఏకైక దైవం డబ్బు ఒక్కటే. దీపిక జేఎన్​యూకి వెళ్లడం చాలా ధైర్యంతో చేసిన పని.  – నసీరుద్దీన్​ షా, సీనియర్​ నటుడు

see also: చిన్నతనంలో నాపై రేప్ జరిగింది

ప్రధాని మోడీకి ఏరియల్ ఎటాక్ ​ముప్పు!

పల్లెటూరోళ్లు పట్నంలో ఓటేసిన్రు