హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎనర్జీ సెక్రటరీ, ట్రాన్స్కో, జెన్ కో సీఎండీ రొనాల్డ్ రోస్ సమీక్ష జరిపారు. గురువారం విద్యుత్ సౌధలో డైరెక్టర్లతో రివ్యూ నిర్వహించారు. ఆన్ గోయింగ్ వర్క్స్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. 400కేవీ, 220కేవీ, 132కేవీ ట్రాన్స్ మిషన్ నెట్ వర్క్ ను సమీక్షించారు.
ఆన్ గోయింగ్ హైవోల్టేజ్ సబ్ స్టేషన్ వర్క్స్ ను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువు లోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమర్జెన్సీలో ఫీల్డ్ ఇంజినీర్లు వారి హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలన్నారు.