
పట్నా: బిహార్‌కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే అలోక్ కుమార్ మెహతాకు చెందిన ప్రదేశాలు, సంస్థల్లో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది.
రాష్ట్ర సహకార బ్యాంకులో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బిహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని ఎమ్మెల్యేలకు చెందిన సుమారు 18 ప్రదేశాలలో సోదాలు చేస్తున్నట్టు వారు తెలిపారు.