జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు

మనీలాండరింగ్ కేసులో టీడీపీ సీనియర్ లీడర్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 17 మందిపై ప్రాసిక్యూషన్ కంప్లైట్ ఫైల్ చేసింది. కాగా.. జేసీ.ప్రభాకర్ రెడ్డి కంపెనీలకు చెందిన గడువు ముగిసిన 154 బీఎస్-3  వాహనాలకు నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వాహనాలను   జేసీ ప్రభాకర్ రెడ్డి ట్రావెల్స్ లో పెట్టి నడుపుతున్నట్లుగా ఈడీ గుర్తించింది.  దాదాపు 38.36 కోట్లు అక్రమాలకు పాల్పడారని ఈడీ తన చార్జీషీట్ లో పేర్కొంది.   ఈ కేసులో 2022లో జేసీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.