మెడ్చల్ జిల్లాలో గంజాయి పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. ఘట్ కేసర్ అన్నోజిగూడలోని ఓ అపార్ట్ మెంటులో మూడు కిలోల గంజాయిని పట్టుకున్నారు. అన్నోజిగూడా చౌరస్తా వద్ద ఉన్న అపార్ట్మెంట్ లో గంజాయి సరఫరా చేస్తున్నట్లు అధికారులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో రంగారెడ్డి జిల్లాఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాత్రి వెళ్లి తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ ను అదుపులోకి తీసుకున్నారు. ఘట్ కేసర్ లో ఇంజినీరింగ్ కాలేఅజీలు ఉండటంతో అక్కడ గంజాయి అమ్ముతున్నట్లు తెలిపారు ఎక్సైజ్ అధికారులు. నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు.