
అలంపూర్/అయిజ, వెలుగు: ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో, అయిజ పట్టణంలోని హోటళ్లలో బుధవారం ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో వాడుతున్న 8 మంది ఓనర్లపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్ వో రేవతి తెలిపారు. అయిజ పట్టణంలో 23 మంది హోటల్ యజమానులపై 6ఏ కేసులు నమోదు చేశామని చెప్పారు. గృహ అవసరాలకు వాడే సిలిండర్లను కమర్షియల్ అవసరాల కోసం వాడవద్దని హెచ్చరించారు. దాడుల్లో డీటీలు శివలింగం, మంగమ్మ, వీఆర్ఏలు కృష్ణ, మహబూబ్ బాషా పాల్గొన్నారు.