ప్రపంచ కప్ 2023లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠ పోరును తలపిస్తోంది. విజయం ఇరు జట్లను దోబూచులాడుతోంది. 285 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 20.4 ఓవర్లలో 117 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లాండ్ జట్టును మట్టి కరిపించాలన్న కసి వారిలో కనిపిస్తోంది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 2 పరుగులకే వెనుదిరగగా.. డేవిడ్ మలాన్(32), జో రూట్(), జోస్ బట్లర్(9), లివింగ్ స్టోన్(10).. ఇలా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇప్పటివరకూ అఫ్ఘాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ, ముజీబ్-ఉర్-రహమాన్, రషీద్ ఖాన్, ఫజల్హక్ ఫరూఖీ తలా వికెట్ తీశారు.
?????? ???? ???????! ?@RashidKhan_19 gets into the act as he traps Liam Livingstone for 10. ??
— Afghanistan Cricket Board (@ACBofficials) October 15, 2023
???????- 117/5 (20.4 overs)
?: ICC/Getty#AfghanAtalan | #CWC23 | #AFGvENG | #WarzaMaidanGata pic.twitter.com/Iqf34VQtza
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన అఫ్ఘనిస్తాన్ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (80; 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపులు మెరిపించగా.. మరో ఓపెనర్ ఇబ్రహీం జాడ్రన్ 28, ఇక్రం అలిఖిల్ 58, ముజీం ఉర్ రెహ్మాన్ 28 పరుగులు చేశారు.
ALSO READ : ముద్దులు..హగ్గులు.. హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్ వేపై జంట రొమాన్స్
INNINGS CHANGE ?
— Afghanistan Cricket Board (@ACBofficials) October 15, 2023
After opting to bat first, #AfghanAbdalyan managed to put in 272/8 runs in the first inning. Abdul Malik (117) stole the show with a fine century, whereas @nasirjamall stepped up and contributed with a fifty (57). ?
Over to our bowlers now...! ?#OMANvAFG pic.twitter.com/1W9nFjPvbO