ప్రపంచ కప్ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‍తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓటమి దిశగా సాగుతోంది . 285 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 30 ఓవర్లు ముగిసేలోపు 160 పరుగుల వద్ద ఏడో కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఆ జట్టు యువ ఆటగాడు హ్యారీ బ్రూక్(64 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
గత రెండు మ్యాచ్‌ల్లో జోరు కనపరిచిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. ఆఫ్ఘన్ బౌలర్ల ముందు తేలిపోతున్నారు. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 2 పరుగులకే వెనుదిరగగా.. డేవిడ్ మలాన్(32), జో రూట్(), జోస్ బట్లర్(9), లివింగ్ స్టోన్(10), సామ్ కరణ్(10), క్రిస్ వోక్స్(9) ఇలా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇప్పటివరకూ అఫ్ఘాన్ బౌలర్లలో ముజీబ్-ఉర్-రహమాన్హమ్మద్ నబీ రెండేసి వికెట్లు తీసుకోగా.. రషీద్ ఖాన్ 1, ఫజల్హక్ ఫరూఖీ 1 తలా వికెట్ తీశారు.
BOWLED HIM! ?@Mujeeb_R88 bowls a ripper as he goes through the defenses of Chris Woakes for 9 to give Afghanistan the 7th wicket. Incredible scenes in Delhi! ??
— Afghanistan Cricket Board (@ACBofficials) October 15, 2023
???????- 160/7 (33 overs)
?: ICC/Getty#AfghanAtalan | #CWC23 | #AFGvENG | #WarzaMaidanGata pic.twitter.com/NYDuhi4mp9
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన అఫ్ఘనిస్తాన్ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (80; 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపులు మెరిపించగా.. మరో ఓపెనర్ ఇబ్రహీం జాడ్రన్ 28, ఇక్రం అలిఖిల్ 58, ముజీం ఉర్ రెహ్మాన్ 28 పరుగులు చేశారు.