వరల్డ్ కప్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టు.. ఆదివారం ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లీష్ సారథి జాస్ బట్లర్.. ఆఫ్ఘనిస్తాన్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్ పిచ్ కావడం, అందునా ఆఫ్ఘన్లు ఎంత నిర్ధేసించినా గెలిచేది తామే అన్న ధీమా వ్యక్తం చేశాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
ఇప్పటివరకూ ఈ ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడగా.. ఆఫ్ఘన్ జట్టు రెండింటిలోనూ ఓటమిపాలైంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు ఒక విజయాన్ని అందుకుంది.
తుది జట్లు
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, ఇక్రమ్ అఖిల్, మహమ్మద్ నబీ, ముజీబ్-ఉర్-రహమాన్, రషీద్ ఖాన్, ఫజల్హక్ ఫరూఖీ.
ఇంగ్లాండ్: జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ.
? TOSS UPDATE ?
— Afghanistan Cricket Board (@ACBofficials) October 15, 2023
England have won the toss and put Afghanistan into bat first. ?#AfghanAtalan | #CWC23 | #AFGvENG | #WarzaMaidanGata pic.twitter.com/CdxEUIJLv3