ఇంగ్లాండ్ ప్లేయర్లు ఏ ముహూర్తాన 'బజ్‌బాల్' పేరుతో బాదడం మొదలుపెట్టారో కానీ, అది వారి మెడకే చుట్టుకుంటోంది. వారి ఆటేమో.. కానీ, ఇంగ్లాండ్ తో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు రెచ్చిపోతున్నాయి. ధనాధన్ బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తున్నాయి. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్- ఆఫ్ఘన్ పోరులో అదే జరుగుతోంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్ ఓపెనర్లు మంచి జోరు కనుపరుస్తున్నారు. ఒకవైపు రహమానుల్లా గుర్బాజ్(69) ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుతుంటే.. మరోవైపు ఇబ్రహీం జడ్రాన్(26; ) నిలకడగా ఆడుతూ అతనికి చక్కని సహకారం అందిస్తున్నాడు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసిన ఆఫ్ఘన్ జట్టు.. 15 ఓవర్లలో 106 పరుగులు చేసింది. వీరి ఊపు చూస్తుంటే ఇవాళ ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచేటట్టే కనబడుతున్నారు.
1️⃣4️⃣ Overs ✅ @RGurbaz_21 (69*) and @IZadran18 (26*) are off and running in Delhi as they take AfghanAtalan to 106/0 after 14 overs. ?#AfghanAtalan | #CWC23 | #AFGvENG | #WarzaMaidanGata pic.twitter.com/oQADNjbEIy
— Afghanistan Cricket Board (@ACBofficials) October 15, 2023