ENG vs AUS: బెన్ డకెట్ 165.. ఆస్ట్రేలియా ఎదుట భారీ టార్గెట్

ENG vs AUS: బెన్ డకెట్ 165.. ఆస్ట్రేలియా ఎదుట భారీ టార్గెట్

చాంపియ‌న్స్ ట్రోఫీ: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 351 పరుగులు చేసింది. ఇంగ్లీష్ ఓపెనర్ బెన్ డకెట్ ఏకంగా 165 పరుగులు చేశాడు. ఇతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఇంగ్లీష్ జట్టు చేసిన మొత్తం స్కోరులో ఇతడివే సగం పరుగులు. 

పసలేని ఆసీస్ బౌలర్లు

పాట్ కమ్మిన్స్, స్టార్క్, హేజెల్ వుడ్ లేనిలోటు ఆస్ట్రేలియా జట్టులో స్పష్టంగా కనిపించింది. కట్టడి చేయగల బౌలర్ లేకపోవడం.. వేసిన బంతుల్లో ఖచ్చితత్వం లేకపోవడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు  తొలి బంతి నుంచే బాదడం మొదలు పెట్టారు. వికెట్లు పడుతున్నా.. స్కోర్ ఎక్కడా ఆగింది లేదు. 

మొదటి పది ఓవర్లకు 73, ఇరవై ఓవర్లకు 132, ముప్పై ఓవర్లకు 200, నలభై ఓవర్లకు 268.. ఇలా రన్‌రేట్ ఎక్కడా తగ్గింది లేదు. ఒక్క ముక్కలో పసలేని పసలేని ఆసీస్ బౌలర్లను డకెట్(143 బంతుల్లో 165;  17 ఫోర్లు, 3 సిక్స్‌లు) చీల్చి చెండాడాడు. అతనికి జో రూట్(68) మంచి సహకారం అందించాడు. చివరలో వరుస వికెట్లు కోల్పోవడం ఇంగ్లాండ్‌ను కాస్త నష్టపరిచింది లేదంటే టార్గెట్  370పైబడే ఉండేది.    
      
ఆస్ట్రేలియా బౌలర్లలో ద్వార్షుయిస్ 3, లబుచానే 2, జంపా 2, మ్యాక్స్ వెల్ ఒక వికెట్ పడగొట్టారు.