వాంఖడే వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టు.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను 229 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట సఫారీ బ్యాటర్లు 399 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ బ్యాటర్లు 170 పరుగులకు కుప్పకూలారు.
ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్కోర్ గురుంచి ఆ జట్టు మాజీ క్రికెటర్ ఏబి డివిలియర్స్ చేసిన ఓ అంచనా తప్పయింది. రీజా హెండ్రిక్స్ (85), రస్సీ వాన్ డెర్ డసెన్ (60) ధాటిగా ఆడుతున్న క్రమంలోఏబీ.. దక్షిణాఫ్రికా స్కోర్ 400 దాటుదుందని వేశాడు. కానీ అలా జరగలేదు. ప్రొటీస్ బ్యాటర్లు 400 పరుగులకు.. పరుగు దూరంలో నిలిచిపోయారు. దీంతో డివిలియర్స్.. అభిమానులను క్షమాపణ కోరాడు. అంచనా తప్పయినందుకు క్షమించండి అని ట్వీట్ చేశారు.
400 on the cards if we don’t lose too many wickets
— AB de Villiers (@ABdeVilliers17) October 21, 2023
"1 పరుగు తేడాతో ఔట్ అయ్యా.. క్షమించండి!.." అని డివిలియర్స్ ఫన్నీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Out by 1 run. Sorry?♂️?
— AB de Villiers (@ABdeVilliers17) October 21, 2023
ఈ మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్లు వీరవిహారం చేశారు. ఇంగ్లాడ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్నట్లుగా ఆడారు. క్లాసెన్(109; 67 బంతుల్లో 12ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి తోడు.. రీజా హెండ్రిక్స్ (85), జాన్సెన్(42 బంతుల్లో 75 నాటౌట్, 3ఫోర్లు, 6 సిక్స్‌లు), డస్సెన్(60) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం ప్రొటీస్ బౌలర్లు కూడా చెలరేగడంతో ఇంగ్లాండ్ వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఘోర ఓటమిని చవిచూసింది.
మ్యాచ్ స్కోర్లు
- దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 399/7
- ఇంగ్లండ్: 22 ఓవర్లలో 170 ఆలౌట్.