సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడుతున్నారు. బ్యాటింగ్ స్వర్గధామమైన బెంగుళూరు పిచ్‌పైన తేలిపోతున్నారు. గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్.. 120 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది.
మొదట ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. భారీ లక్ష్యం నిర్ధేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ అదంతా తప్పని తొలి 10 ఓవర్లలోపే తేలిపోయింది. లంక బౌలర్ల ధాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. జానీ బెయిర్ స్టో (30), డేవిడ్ మలన్(28), జో రూట్(3), జోస్ బట్లర్ (8), లివింగ్‌స్టోన్(1), మొయిన్ అలీ(15).. ఇలా రాణిస్తారనుకున్న ఆటగాళ్లందరూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. దీంతో ఇంగ్లాండ్ 25 ఓవర్లు ముగిసేసరికే 6 కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం స్టోక్స్ (33 నాటౌట్), క్రిస్ వోక్స్(0) క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో మాథ్యూస్, కసున్ రజిత, లహిరు కుమార తలా 2 వికెట్లు తీసుకున్నారు.
ALSO READ :- దేశంలోనే అతిపెద్ద విపత్తుపై వెబ్ సిరీస్.. ఆసక్తిరేపుతున్న రిలీజ్ వీడియో
England today:
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2023
First 6.1 overs - 45/0.
Next 8.5 overs - 32/4.
- A super comeback by Sri Lanka! pic.twitter.com/n7Ebj5jNso
ENGLAND 122 FOR 6 AT CHINNASWAMY....!!!!
— Johns. (@CricCrazyJohns) October 26, 2023
- 45/0 to 122/6....World Champions going down. pic.twitter.com/Eu462yZIxC