వన్డే ప్రపంచ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టు పోరాటం ఇక ముగిసినట్టే. ఇదివరకు ఆడిన నాలుగింటిలో మూడింట ఓడిన ఇంగ్లాండ్.. గురువారం శ్రీలంక చేతిలో మరో ఓటమితో అనధికారికంగా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ బ్యాటర్లు.. లంకేయుల ముందు 157 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. లంక కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ చేధించింది. లంక బ్యాటర్లలో నిస్సాంక (77, సమర విక్రమ (65) హాఫ్ సెంచరీలు చేశారు.
అంతకుముందు బ్యాటింగ్‌కు అనుకూలించే చిన్నస్వామి పిచ్‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు దారుణంగా విలమయ్యారు. 33.2 ఓవర్లలో 156 పరుగులక వద్ద ఆలౌట్ అయ్యారు. 43 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ ఆ జట్టు టాప్ స్కోరర్. జానీ బెయిర్ స్టో(30), డేవిడ్ మలన్(28), జో రూట్(3), జోస్ బట్లర్ (8), లివింగ్‌స్టోన్(1), మొయిన్ అలీ(15) పరుగులు చేశారు. లంక బౌలర్లలో లహిరు కుమార 3 వికెట్లతో చెలరేగగా.. మాథ్యూస్, కసున్ రజిత చెరో 2, తీక్షణ ఒక వికెట్ తీసుకున్నారు.
నిన్నటిదాకా పాయింట్ల పట్టికలో కింద నుంచి మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఈ ఓటమి మరింత కిందకియు నెట్టింది.
England likely to be knocked out of the 2023 World Cup if they lose against India on Sunday. pic.twitter.com/0RKsRCdJie
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2023
All teams have played 5 matches each.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2023
India bossing the Points Table with zero defeats. England on the verge of getting knocked out! pic.twitter.com/0yUg9u0K28