ఆతిథ్య దేశం, రెండుసార్లు టీ20 ప్రపంచకప్ విజేత వెస్టిండీస్‌కు ఇంగ్లాండ్ షాకిచ్చింది. గురువారం(జూన్ 20) జరిగిన సూపర్-8 తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కరీబియన్ బ్యాటర్లు నిర్ధేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి, మరో 15 బంతులు మిగిలివుండగానే చేధించింది. ఛేదనలో ఇంగ్లీష్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(87 నాటౌట్; 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ శతకం బాదాడు.
ఒకే ఓవర్‌లో 30 పరుగులు
181 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లీష్ ఓపెనర్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆది నుంచే కరేబియన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్‌కు పీడకలను మిగిల్చాడు. ఈ విండీస్ ఆల్‌రౌండర్ వేసిన 16వ ఓవర్‌లో సాల్ట్ బౌండరీల వర్షం కురిపించాడు. 4, 6, 4, 6, 6, 4 బాది ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. దీంతో మ్యాచ్ స్వరూపం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఘనమైన రికార్డు
టీ20ల్లో వెస్టిండీస్‌పై ఫిల్ సాల్ట్‌కు మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో సాల్ట్ ఇప్పటివరకు 26 ఇన్నింగ్స్‌లలో 844 పరుగులు చేయగా.. అందులో సగానికిపైగా పరుగులు విండీస్ పై చేసినవే కావడం గమనార్హం. కరేబియన్ జట్టుపై ఇప్పటివరకూ 9 ఇన్నింగ్స్‌లలో 487 పరుగులు చేశాడు.
Early days... but will England top this group? #WIvENG pic.twitter.com/3iQAwUrbtN
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2024