
- జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఘటన
జీడిమెట్ల, వెలుగు: ఎంగేజ్ మెంట్ అయిన యువతి ఆత్మహత్య చేసుకుంది. జీడిమెట్ల సీఐ పవన్ తెలిపిన ప్రకారం.. సుభాశ్ నగర్ లాస్ట్ బస్ స్టాప్ సమీపంలో ఉండే నాగదుర్గకు గత ఫిబ్రవరిలో ఎంగేజ్ మెంట్ అయింది. ఆమె తల్లిదండ్రులు సత్యవతి, కడియం శెట్టిలు శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లారు. నాగదుర్గ, ఆమె సోదరుడు ఇంట్లో ఉన్నారు. శనివారం మధ్యాహ్నం తినడానికి ఏమైనా తీసుకురమ్మని సోదరుడికి చెప్పి బయటకు పంపించింది.
ఫుడ్ తీసుకొని ఇంటికొచ్చి తలుపు కొట్టగా గడియ పెట్టి ఉంది. నాగదుర్గను ఎంత పిలిచినా బయటకు రాలేదు. తలుపులు పగల కొట్టి చూసే సరికి ఆమె ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించింది. స్థానికుల సాయంతో ఆమెను కిందకి దింపి చూడగా అప్పటికే ఆమె మృతిపోగా.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెళ్లి ఇష్టం లేకనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని నాగదుర్గ తండ్రి కడియం శెట్టి కంప్లయింట్ చేశారని సీఐ పవన్ తెలిపారు.