చెన్నైలో ఆంధ్రా స్టూడెంట్ డ్రగ్స్ దందా.. మాఫియా డాన్ కావాలనే కోరికతో ఇలా..!

చెన్నైలో ఆంధ్రా స్టూడెంట్ డ్రగ్స్ దందా.. మాఫియా డాన్ కావాలనే కోరికతో ఇలా..!

చెన్నైలో ఆంధ్రా స్టూడెంట్ డ్రగ్స్ దందా..చదివేది ఇంజనీరింగ్.. ఆలోచనలు మాత్రం మాఫీయా డాన్ లాగా.. రాత్రికి రాత్రే మిలియనీర్ కావాలని కోరిక అతన్ని పక్క దారి పట్టించాయి. డ్రగ్స్ దందా చేసే వారితో పరిచయాలు..ఇంకేముందు డ్రగ్స్ దందాలో మునిగి తేలాడు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు..  

ఏపీనుంచి ఇంజనీరింగ్ చదివేందుకు చెన్నై కి వెళ్లిన ముదాసిర్ అనే విద్యార్థి  డ్రగ్స్ దందా చేస్తూ పోలీసులకు చిక్కాడు..30యేళ్ల ముదాసిర్ ను  చెన్నై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతడినుంచి 5 గ్రాముల మెథాంపెటమైన్ అనే డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అతని సహచరులు మహేష్, ఫరూఖ్, మిథున్, ఖాదర్ మెయిదీన్, దీపన్ లు ఇప్పటికే అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత కొంత కాలంగా పరారీలో ఉన్న ముదాసిర్ ను నార్త్ బీచ్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముదాసిర్ పై థౌజండ్స్ లైట్; నందం బాక్కం, ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లలో డ్రగ్ కేసులు ఉన్నాయి. 

ముదాసిర్ చెన్నైలో ని ఓ ప్రైవేట్  ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలనే కోరికతో డ్రగ్స్ మాఫియాతో పరిచయం పెంచుకున్నాడు. ఒక గ్రాము ప్యాకెట్ కు 500 చొప్పున కమిషన్ తీసుకుంటూ డ్రగ్స్ సరఫరా చేస్తు్న్నారు. 

ముదాసిర్ కొంతమందికలిసి ఓ ముఠాగా ఏర్పడి  చెన్నై విద్యార్థులు, సాఫ్ట్ వేర్లు లక్ష్యంగా డ్రగ్స్ అమ్ముతున్నాడు. ఫామ్ హౌజ్ లు, హోటళ్లు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు బస చేసే ప్రదేశాల్లో పార్టీలు లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్ర రాల డ్రగ్స్ ముఠాల నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు.  పక్కా ప్రణాళికతో వలపన్నిన పోలీసులు ముదాసిర్ ను అరెస్ట్ చేశారు.