
కులం, కట్నం, ఆస్తిపాస్తుల ప్రతిపాదన లేకుండా ఈ రోజుల్లో పెళ్లిళ్లు జరుగుతాయా? కేవలం వధూవరుల ఇష్టాయిష్టాలు, ప్రేమ ఆధారంగా ఒక్కటయ్యే అవకాశముందా? ఇలా జరగడం చాలా అరుదనే చెప్పాలి. ఎందుకంటే మన వైవాహిక వ్యవస్థలో కుల వివక్ష, వరకట్నం లాంటి కలుపు మొక్కలు మొండి వృక్షాలై పాతాళానికి కూరుకుపోయాయి. కానీ ఢిల్లీలోని జమ్రుద్‌పూర్ లో గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడి వివాహంలో ఓ ప్రకటన చేశారు. ఎలాంటి కట్నం లేకుండా.. ఇంజనీరు.. పీహెచ్డీ విద్యార్థిని పెళ్లి జరిగింది.
వివాహ సభలో వరుడి తండ్రి పెళ్లికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించాడు. తన కుమారుడు సిద్దార్ధ్ ... శ్రుతి వివాహానికి వచ్చిన బంధువులకు.. పెద్దలందరికి నమస్తే అంటూ.. ప్రస్తుతం సమాజంలో బలంగా నాటుకుపోయిన వరకట్న ఆచారాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందంటూ.. ఇలాంటి సందేశం ఇచ్చే లక్ష్యంటా తన కుమారుడి వివాహంలో ఎలాంటి కట్నం తీసుకోలేదన్నారు.
వరుడు సిద్ధార్థ్ వృత్తిరీత్యా ఇంజనీర్... వధువు శ్రుతి అసోసియేట్ ప్రొఫెసర్. ఆమె ప్రస్తుతం PhD చదువుతోంది అని వరుడి తండ్రి చెబుతున్నప్పుడు అక్కడ ఉన్నవారు చప్పట్లు కొడుతున్నారు. ఈ జంట ఫిబ్రవరి 23న వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఎలాంటి కట్నం లేకుండా.. ఆడంబరం లేకుండా జరుగుతుందన్నాడు. సంప్రదాయంగా .. ఎలాంటి ఆర్భాటాలు.. ప్రదర్శనలు లేకుండా చేస్తున్నామన్నారు. ఈ వివాహం పూర్తిగా కట్నం లేకుండా, ఎలాంటి ఆడంబరం లేకుండా జరుగుతోందని నేను అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అన్ని వేడుకలు ఎటువంటి ప్రదర్శన లేకుండా నిర్వహించబడ్డాయి. ఇది సమాజంలోని ఇతరులకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నామని సిద్దార్థ్ తండ్రి అన్నారు.
ఈ వీడియోను gurjar_boys_page అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో వరుడి కుటుంబం చిట్టి , లగాన్ .. కన్యాదానంతో సహా అన్ని వివాహ ఆచారాలకు రూ. 101 మాత్రమే అంగీకరించిందని పేర్కొంది . ఏ రూపంలోనూ కట్నం లేదా వస్తువులు తీసుకోలేదు అని రాసి ఉంది.
పెళ్లి అనేది భారతీయ సంప్రదాయంలో చాలా పెద్ద ఘట్టం. వివాహం ద్వారా రెండు కుటుంబాల మధ్య కొత్త బంధం ఏర్పడుతుంది. పెళ్లి సంప్రదాయంలో పూర్వకాలం నుంచి వధువు కుటుంబం .. వరుడి కుటుంబానికి వరకట్నం రూపేణ కొంత డబ్బు.. ఇతర లాంఛనాలు ఇస్తూ.. వధువు తల్లిదండ్రులు కన్యాదానం చేస్తారు. ఈ కాలంలో పెళ్లి తరువాత వరకట్న వేధింపులు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి రోజుల్లో .. ఢిల్లీలోని జమ్రుద్‌పూర్ లో గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడి వివాహంలో ఓ ప్రకటన చేశారు.