అంకిత్ నాగవంశీ చిన్నప్పట్నించీ చదువుల్లో ఫస్ట్. బీటెక్ పట్టా చేతికిరాగానే ఐటీ జాబ్ వచ్చింది. వేలల్లో జీతం. లైఫ్ సెట్ అన్నారు ఫ్రెండ్స్. ఫ్యామిలీ మస్త్ ఖుష్ . కానీ, ఆ నైన్ టు ఫైవ్ జాబ్ బోర్ అనిపించింది అతనికి. ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. తనకి ఇష్టమైన ఫుడ్ వైపు మనసు మళ్లింది. ‘‘అంత మంచి ఉద్యోగం వదులుకుంటవా’’ అని ఫ్యామిలీ వాదించింది. ఇరుగుపొరుగు వింతగా చూశారు. కానీ, తాను అనుకున్నది చేయాలనుకున్నడు అంకిత్. ప్రస్తుతం చాయ్ అమ్ముతూ నెలకి అరవైవేలు సంపాదిస్తున్నడు.
అంకిత్ది మధ్య ప్రదేశ్ చింద్వారా. బిటెక్ తర్వాత ముంబైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్‌గా ఉద్యోగంలో చేరాడు. నెలకి 70 వేల జీతం. కానీ, సంతృప్తి లేదు. కంప్యూటర్‌తో కుస్తీలు వద్దనుకున్నాడు. ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాలనుకున్నాడు. ఉద్యోగం చేస్తూ ఫ్రీ టైంలో కొన్నాళ్లు రీసెర్చ్ చేశాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు రావాలంటే చాయ్ బిజినెస్ బెస్ట్ ఆప్షన్ అనుకున్నాడు. 2019లో ఫ్యామిలీకి నచ్చకపోయినా జాబ్ వదిలేసి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాడు.
డిఫరెంట్‌గా..
ప్రతి ఊళ్లో గల్లీకో టీ కొట్టుంటుంది. వాటిల్లో ఒకటిగా తన టీ ఉండకూడదు అనుకున్నాడు అంకిత్. తన చాయ్‌కి ఓ స్పెషాలిటీ ఉండాలనుకున్నాడు. అందుకోసం జైపూర్, పూణె, అమృత్ సర్, ఢిల్లీ ఇలా చాలా సిటీలు తిరిగి చాయ్ రుచులన్నీ చూశాడు. డిఫరెంట్ మేకింగ్ ప్రాసెస్‌లన్నీ తెలుసుకుని సొంత ఊళ్లో ‘ఇంజనీర్ చాయ్‌వాలా’ పేరుతో చాయ్ అమ్మడం స్టార్ట్ చేశాడు. అంకిత్ తయారుచేసిన అల్లం, తులసి, పుదీనా, మసాలా టీలు, దక్షిణ భారతంలో తాగే ఫిల్టర్ కాఫీలు బాగా ఫేమస్ అయ్యాయి మహారాష్ట్రలో ఇప్పుడు. తన చేతి టీ కోసం కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు జనాలు. రోజుకి 400 టీలు అమ్ముతాడు అంకిత్. దాదాపు అన్ని ఖర్చులు పోనూ నెలకి 60,000 వేల రూపాయలు మిగులుతాయి.
రీసెంట్గా పోహ కూడా తన మెనూలో యాడ్ చేశాడు. అతి త్వరలో స్టోర్స్ ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాడట ఈ బిటెక్ గ్రాడ్యుయేట్.